మరోసారి ఇష్క్ కాంబో రిపీట్.. త్వరలోనే నితిన్ – విక్రమ్ల సినిమా

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఈ హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఒక్క హిట్ కూడా పడటం లేదు. హిట్ చూసి నితిన్కు దశాబ్ధ కాలమైపోతోంది. గతంలో సరైన హిట్ లేక వరస ఫ్లాప్‌లతో ఇబ్బందిపడిన నితిన్ను మళ్లీ విజయాల బాట పట్టించిన సినిమా ‘ఇష్క్‌’ . విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. రొమాంటిక్‌ డ్రామా కథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాలో నితన్ – నిత్యా మీనన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్.

2012లో వచ్చిన ఆ చిత్రం తర్వాత మళ్లీ నితిన్‌ – విక్రమ్‌ కె.కుమార్‌ కలిసి సినిమా చేయలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో సినిమాకు పని చేయబోతున్నారట. ప్రస్తుతం నితిన్‌ ‘తమ్ముడు’, ‘రాబిన్‌హుడ్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తయ్యాక నితిన్‌ – విక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయట. ఈ కాంబోలో సినిమా అంటే నితిన్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version