గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంత మంది బాగుందంటే మరికొంతమంది… పెద్దగా నచ్చలేదని చెబుతున్నారు. ఈ తరుణంలోనే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలారు. మార్నింగ్ షోలలో 55.82% కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక మ్యాట్నీలో 39.33 మాత్రమే వచ్చిందట. ఈవినింగ్ షో లలో 50.53 శాతం ఆక్యుఫెన్సీ నమోదు అయినట్లు చెబుతున్నారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 186 కోట్లకు పైగా వసూలు చేయడంతో దేవర రికార్డు బ్రేక్ చేసింది. దేవర మూవీకి మొదటి రోజు 172 కోట్లు వచ్చాయి, పుష్ప 2 కు ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 294 కోట్లు వచ్చాయి.
King size entertainment unleashes in theatres 🔥#GameChanger takes a blockbuster opening at the BOX OFFICE 💥💥#BlockbusterGameChanger GROSSES 186 CRORES WORLDWIDE on Day 1 ❤🔥
Book your tickets now on @bookmyshow
🔗 https://t.co/ESks33KFP4Global Star @AlwaysRamCharan… pic.twitter.com/NqiqvscgR8
— Sri Venkateswara Creations (@SVC_official) January 11, 2025