గ్రామ అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. గ్రామ అలాగే వార్డు సచివాలయాలలో రేషన్అలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. గ్రామ అలాగే వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి.. రేషన్ అలైజేషన్ అమలు చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కనీసం 2500 మంది జనాభా కు ఒక సచివాలయం ఉండే లా చంద్రబాబు నాయుడు సర్కార్ చూసుకుంటుంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సేస్ ఫంక్షనరీస్, అలాగే నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారని తెలిపింది. 2500 నుంచి 3500 మంది కి ఏడుగురు ఉంటారని వివరించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 3500 కు పైగా ఉన్న జనాభా సచివాలయాల పరిధిలో… ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారని పేర్కొంది. ఇలా విభజిస్తే పరిపాలన చాలా సులభంగా జరుగుతుందని తెలిపింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్.