టాలీవుడ్ యంగ్ నటుడు రాజ్ తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదయింది. హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్రోత్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని నార్సింగి పీఎస్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. అతడు మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. ఇందులో రాజ్ తరుణ్‌ను ఏ1గా, మాల్వీ-ఏ2, మయాంక్-ఏ3లుగా కేసు ఫైల్ చేశారు.
ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. జనవరిలో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నన్ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసు ఆరోపణలతో నన్ను 45 రోజులు జైలులో పెట్టారు. రాజ్‌తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నన్ను ఇరికించారు. నన్ను మోసగించిన రాజ్ తరుణ్‌పై చర్యలు తీసుకోవాలి. అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య విజ్ఞప్తి చేసింది.