కడపలో వైసీపీకి షాక్ తగిలింది. రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి టిడిపి పార్టీలో చేరికకు రంగం సిద్దం అయింది. కడప కార్పోరేషన్ లో 46 డివిజన్ కార్పోరేటర్ గా రామచంద్రారెడ్డి సతీమణి శ్రీదేవి కొనసాగుతున్నారు. చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరుటకు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవి విజయవాడ చేరుకున్నారు.
ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవి టిడిపి పార్టీలో చేరే ఛాన్స్ ఉంది.
కాగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యాడు. శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పై వైసీపీ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పని చేశారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్ధారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించినట్లు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు అందడంతో ఆ పార్టీ అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.