Rakhi Sawant : ప్రేమికుల రోజునే.. విడాకులు తీసుకున్న శృంగార తార

-

చిత్ర పరిశ్రమలో విడాకులు చాలా కామన్‌ అయిపోయాయి. ఇప్పటికే చాలా మంది విడాకులు తీసుకుకోగా… ప్రేమికుల రోజులనే బాలీవుడ్‌ శృంగారం తార రాఖీ సావంత్‌ బాంబు పేల్చింది. తన భర్త రితేశ్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రకటన చేసింది. బిగ్‌ బాగ్‌ రియాల్టీ షో తర్వాత చాలా పరిణామాలు జరిగాయని తెలిపింది. రాఖీ సావంత్‌ బిగ్‌ బాస్‌ షోలో కంటెస్టెంట్‌ గా పాల్గొంది. అయితే.. ఇవాళ వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితంపై ప్రకటన చేసింది.

” ప్రియమైన ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు.. నేనున, రితేశ్‌ విడిపోవాలని.. నిర్ణయం తీసుకున్నాం. బిగ్‌ బాస్‌ షో తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రిచలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను, రితేశ్‌ చాలా చర్చించాం. కానీ సాధ్య పడలేదు. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయం తీసుకున్నాం. విడిపోయి చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. ” అంటూ పోస్టు పెట్టింది. ఇక ఈ పోస్టు చూసిన ఆమె అభిమానులు షాక్‌ కు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version