పొలిటిక‌ల్ పొలికేక :  రోజా క‌ల‌ల‌కు అడ్డంకి ఎవ‌రు? 

-

మంత్రికి త‌క్కువ ఎమ్మెల్యేకు ఎక్కువ అన్న విధంగా రోజా ఉంటున్నారన్న‌ది విప‌క్షం ఆరోప‌ణ.మూతి ప‌గులుద్ది అన్న డైలాగ్ ను రోజా వాడి, వాడీ వేడీ రాజ‌కీయాల‌కు మ‌రింత కొన‌సాగింపు ఇచ్చారు.దీంతో న‌గ‌రి టీడీపీ భ‌గ్గుమంది.అస‌లే ఇంటిపోరుతో అల‌స‌ట చెందుతున్న రోజాగా టీడీపీలో ఉన్న పెద్ది రెడ్డి వ‌ర్గం మ‌రింత త‌ల‌నొప్పిగా మారారు. పెద్దిరెడ్డి కూడా  అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ రోజాకు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గాన్ని ప్రోత్సహిస్తూ త‌న‌దైన రాజ‌కీయం న‌డుపుతున్నారు.దీంతో వచ్చే ఎన్నిక‌ల్లో రోజాకు టికెట్ క‌ష్ట‌మే అని కూడా అంటున్నారు. వాస్త‌వానికి వైసీపీ ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు వెన్నుద‌న్నుగా ఉండే పెద్దిరెడ్డి ఓ ద‌శ‌లోసీఎం కావాల‌ని ఆ విధంగాత‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌ని క‌ల‌లు క‌న్నారు.ఒక‌వేళ రేప‌టి వేళ ష‌ర్మిల ఆంధ్రా కేంద్రంగా పార్టీ పెడితే అది  త‌ప్ప‌క జ‌గ‌న్ కు ఇబ్బందే! అప్పుడు పెద్ది రెడ్డి వ‌ర్గం రోజాను మ‌రింత ఇబ్బంది పెట్టేందుకు ష‌ర్మిల వైపు వెళ్లినా వెళ్తారు.

ఇక వైసీపీ రాజకీయాల్లో రోజా పూర్తిగా విఫ‌లం అవుతున్నారు.ఇప్ప‌టికీ ఆమె స్టేజ్ షోల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి ఏ పాటి శ్ర‌ద్ధ కూడా చూప‌డం లేద‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ముఖ్యంగా ఆమె స్థానికురాలు కాద‌న్న వాద‌న ఒక‌టి ఈ సారి ఎన్నిక‌ల్లో తీసుకువ‌చ్చి ఆమెను చిత్తు చిత్తుగా ఓడించాల‌ని అనుకుంటున్నారు టీడీపీ నేత‌లు. కానీ రోజా మాత్రం త‌న‌దైన వాగ్ధారతో నెగ్గుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికీ ఆమె ఒంటరి పోరు సాగిస్తున్నారు.డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి. పెద్దిరెడ్డి, చెవి రెడ్డి, కరుణాక‌ర్ రెడ్డి ఇలా అంతా  ఆమెకు వ్య‌తిరేక‌మే కానీ ఆమె రాజ‌కీయం మాత్రం సాగిస్తున్నారు. ఓ విధంగా జ‌గ‌న‌న్న‌పై భారం వేసి రాజ‌కీయం చేస్తున్నారు అన్న‌ది ఓ వాస్త‌వం. అంగీక‌రించ‌క‌త‌ప్ప‌ని నిజం.

Read more RELATED
Recommended to you

Exit mobile version