మంగళవారం సినిమా రిలీజ్.. ఎమోషనల్ అయిన పాయల్

-

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా కుర్ర కారు హృదయాలను తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఆమె అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే రాలేదు కానీ నిత్యం సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్లతో నిత్యం ట్రెండింగ్ లో ఉంటుంది.

అయితే, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ‘కొన్ని గంటల ముందే మంగళవారం చూశా. సవాళ్లు ఎదురైనా…. ఎంతో కష్టపడి చేశా. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇప్పటికే కొన్ని చోట్ల మూవీ విడుదల కాగా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. సపోర్ట్ చేస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పాయల్ భావోద్వేగానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news