సిద్ధార్థ్‌తో రిలేషన్‌పై రిపోర్టర్ ప్రశ్న.. అదితీరావు హైదరి స్ట్రాంగ్ రియాక్షన్

-

సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై బాలీవుడ్ బ్యూటీ అదితీరావు హైదరీ స్పందించింది. అలాంటి విషయం ఏదైనా ఉంటే తానే అందరితో చెబుతానని చెప్పింది. ‘తాజ్‌’  సక్సెస్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది.

‘‘ఒకవేళ అందరితో పంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే.. నేనే తప్పకుండా చెబుతా. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి విషయాలపై ఉండొచ్చు కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్‌పై చూడటమంటేనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్‌ను అందించగలం. అదే మాకు ముఖ్యం’’ అని అదితి చెప్పింది.

అయినా ఓ రిపోర్టర్ సిద్ధార్థ్‌తో డేటింగ్‌ గురించి అదితి రియాక్షన్ ఏంటని అడగ్గా..  ‘‘మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంక నేనేమి చెబుతా. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’’ అని కాస్త అసహనంగా ఆమె బదులిచ్చింది. దీంతో ఆ రిపోర్టర్.. ‘‘ఇది ఆడియన్స్‌ ప్రశ్న మేడమ్‌’’ అని అనగా.. ‘‘ఆడియన్స్‌ ఎవరూ నన్ను ఇలాంటి ప్రశ్న అడగలేదు. మీరే నన్ను అడిగారు’’ అని చెప్పింది

Read more RELATED
Recommended to you

Exit mobile version