వైసీపీ నేతల భార్యలు, పిల్లలపై ట్రోలింగ్‌ చేసినా శిక్ష తప్పదు – చంద్రబాబు

-

వైసీపీ నేతల భార్యలు, పిల్లలపై ట్రోలింగ్‌ చేసినా శిక్ష తప్పదంటూ సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్‌ ఇచ్చారు. ఆడ బిడ్డల జోలికి వస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించారు సీఎం చంద్రబాబు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ… శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ తెలిపారు చంద్రబాబు నాయుడు.

chandrababu comments on ycp leaders

జగన్ కు తల్లి, చెల్లి అంటే గౌరవం లేదన్న ముఖ్యమంత్రి…. మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసన్నారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు.

కొందరూ పోలీసులు లూలూఛీ పడితే వారికదే లాస్ట్ డే. టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేనే. నా దగ్గర మీ కథలు ఏంటి..? బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు. ముఖ్యంగా శ్రైశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కందుల దుర్గేష్, ఆనం, జనార్థన్ ఉండనున్నట్టు తెలిపారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని.. విజయవాడ నుంచి శ్రీశైలంకి 40 నిమిషాల్లో వచ్చామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version