వైసీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే.. చాలు… కేసులు పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తున్నారు ఏపీ పోలీసులు. అయితే.. తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డికు ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు.
సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డితో పాటు ఇద్దరు వ్యక్తులపై పులివెందుల లో కేసు నమోదు అయింది. వైసీపీ సోషల్ మీడియా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి తో పాటు వర్ర రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డి ల పై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేశారు. హరి అనే వ్యక్తిని కులం పేరుతో దూషించిన ఘటనలో ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.