నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. ఈ చిత్రం ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో బాలయ్య నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే పెద్ద విజయాన్ని అందించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ పై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ -2 సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాని అన్ని సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి ఎక్కువగా అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. అంతా కూడా ఈ సినిమాలో కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా కొన్ని కఠినమైన సన్నివేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రాజకీయ నేతలను టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ -2 అనేది పాన్ ఇండియా ఫిలిం అని, చిత్రబృందం కూడా మంచి బజ్ ఏర్పాటు చేస్తోంది.