మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్.. అఖిల్ తో చరణ్ సర్ ప్రైజ్..!

-

అక్కినేని వారసుడు అఖిల్ 3వ సినిమాగా వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. తొలిప్రేమతో డెబ్యూ మూవీనే హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజిక్ పరంగా తొలిప్రేమ మ్యాజిక్ రిపీట్ చేసేలా కనిపిస్తున్న ఈ మూవీ నుండి వచ్చిన మొదటి సాంగ్ హిట్ అవగా క్రిస్ మస్ సందర్భంగా సినిమాలోని సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

దేవదాసు మనవడివో అంటూ మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ బాగుంది. సినిమా షూటింగ్ లో చరణ్ వచ్చి సినిమా రషెష్ చూస్తున్న వీడియోని ఈ సాంగ్ లో ఉంచారు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన అఖిల్ ఇంతవరకు హిట్ అందుకోలేదు. మొదటి సినిమా అఖిల్ రెండో సినిమా హలో రెండూ నిరాశపరచాయి.

మరి ఈ మిస్టర్ మజ్ను అయినా అఖిల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా జనవరి 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి అఖిల్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version