మరో వ్యాధితో బాధపడుతున్న సమంత !

-

టాలీవుడ్ హీరోయిన్ సమంత సంచలన పోస్ట్ చేసింది. ఆ వ్యాధి నుంచి నేను నుంచి కోలుకుంటున్నా అంటూ పేర్కొంది సమంత. స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల చికెన్ గున్యా బారిన పడిన విషయం తెలిసిందే. దాని నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నట్లు సామ్ పోస్టు చేసింది.

Samantha

జర్వం వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్నీగా ఉందని పేర్కొంటూ వర్కౌట్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్ అవుతోంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.

కాగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం ఫుల్లు బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సామ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఒక్క సినిమాలే కాకుండా వెబ్ సిరీసుల్లో సైతం సామ్ మెరుస్తున్నారు. రీసెంట్‌గా హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ హిందీ డబ్బింగ్ ‘హనీ బన్నీ’లో నటుడు వరుణ్ ధావన్‌కు జంటగా సమంత లీడ్ రోల్ ప్లే చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version