“ప్రపంచం ముందు హీరో అవడం కంటే – పెళ్ళాం ముందు హీరో అవడం గొప్ప” అల్లు అర్జున్ !!

-

“మ్యూజిక్ సిట్టింగ్స్ లో లవ్ సిట్యుయేషన్ సాంగ్ వచ్చినప్పుడు .. తమన్ గారు అందరూ మాట్లాడుకున్నప్పుడు నన్ను అడిగారు .. నాకు అందరికీ పిచ్చెక్కిపోయే పాట కావాలి అన్నాను .. సామాజవరగమన సాంగ్ సీతారామ శాస్త్రి రాసిన తరవాత ఇంకా స్థాయి పెరిగింది. ఎప్పుడూ నేను ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోలేదు. మా ఆవిడ కూడా ఇంట్లో ఒకసారి ఎక్కడికి వెళ్ళినా ఈ పాట వినిపిస్తోంది అని మా ఆవిడ చిరాకు పడే రేంజ్ కి వచ్చింది .. అప్పుడు అనిపించింది” ప్రజల ముందు వచ్చే హీరోయిజం కన్నా పెళ్ళాం ముందు వచ్చే హీరోయిజం గొప్పది” అనిపించింది.

ఈ పాట నా కెరీర్ లో మర్చిపోలేని సాంగ్ ఇది .. త్రివిక్రమ్ గారు కూడా మాస్ సాంగ్ ఉండాలి అని రాములో రాముల పెట్టారు .. అది కూడా అనుకోకుండా బ్లాక్ బస్టర్ అయిపోయింది.” అని చెప్పుకొచ్చారు అల్లూ అర్జున్. “తెలుగు మనం కాపాడుకోవాలి ” అంటూ లిరిసిస్ట్ ల గురించి మాట్లాడాడు బన్నీ. ” నా సినిమా లో అద్భుతమైన సాంగ్స్ రాసిన ప్రతీ ఒక్కరికీ ఎప్పటికీ థాంక్స్ చెబుతూనే ఉంటాను .. ఈ పాటల కోసం కష్టపడిన అందరికీ ధన్యవాదాలు .. మీ అందరూ కష్టపడ్డారు నాకోసం .. ఫైనల్ గా దీని గొప్పతనం నేను ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాను ..” అన్నాడు బన్నీ.

 

స్టేజీ మీద తమన్ ని ముందుకు తీసుకొచ్చి మరీ అల్లూ అర్జున్ ఆయన్ని పొగిడారు ” తమన్ చాలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు కానీ దీని తరవాత ఆయన కి స్థాయి పెరిగింది . . సినిమా స్థాయి కూడా పెరిగింది. ఈ సినిమా కి పనిచేసిన ps వినోద్ గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను .. రామ్ లక్ష్మణ్ లు చాలా కష్టపడ్డారు. మొదటి సినిమా నుంచి నన్ను ఆదరిస్తున్న టెక్నీషియన్ లకి కూడా స్పెషల్ థాంక్స్ . మురళీ శర్మ గారు గొప్ప పాత్ర చేశారు .. ఇవాళ రాలేదు కానీ ఆయనకి స్పెషల్ కారెక్టర్ ఇవ్వడం జరిగింది . మలయాళం నుంచి వచ్చి ఇందులో నటించిన అందరికీ ధన్యవాదాలు . ఇందులో నటించిన ప్రతీ ఒక్కరూ .. సునీల్ దగ్గర నుంచి రాహుల్ రామకృష్ణ గారి వరకూ .. నవదీప్ ఇలా ఎప్పుడూ నాకోసం కష్టపడ్డారు వీళ్ళు .. సుశాంత్ నాకోసం ఈ కారెక్టర్ కి ఒప్పుకున్నాడు . చాలా హ్యాపీ అనిపించింది.. ” అని చెప్పుకొచ్చాడు బన్నీ .. తన కూతురు దోస స్టెప్ అంటూ మాట్లాడినా వీడియో గురించి కూడా గుర్తుకు తెచ్చారు బన్నీ. ఆడవాళ్ళ డైలాగ్ గురించి కూడా స్టేజీ మీద చెప్పి అందరికీ ఆహ్లాదం ఇచ్చాడు అల్లూ అర్జున్. పూజ హెగ్డే , నివేత అందరికీ థాంక్స్ చెప్పారు ..

Read more RELATED
Recommended to you

Exit mobile version