తెలుగు ప్రజలను పచ్చిగా మోసం చేసిన బడ్జెట్ ఇది అని వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఖర్చుల గురించి పీఏసీ ఛైర్మన్ గా చేసిన పయ్యావుల కేశవ్ కు తెలియదా. మహిళలను నిలువునా మోసం చేశారు. ఇప్పటివరకు ఉచిత బస్సు ఊసే లేదు. మహిళలకు 1500 అన్నారు.. ఇప్పుడు మర్చిపోయారు.
ఇక నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను మళ్లీ మోసం చేశారు. గతంలో 2 లక్షల 11 వేల ఉద్యోగాలను జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగాల ఊసేఎత్తలేదు. మూకుమ్మడిగా బడ్జెట్ లో ప్రజలను మోసం చేసింది. 17 మెడికల్ కాలేజీల ఊసే లేదు. మత్స్యకారులకు కేటాయింపులు లేవు. రెండు లక్షల కోట్లు అమరావతికి ఖర్చు అవుతుందని చెప్పిన చంద్రబాబు కేవలం 6 వేల కోట్లు ఇచ్చి మోసం చేశారు అని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు.