ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పుణ్యమా అని ఇప్పుడు ఇండియన్ స్టార్ సెలబ్రిటీ ల రేంజ్ పూర్తిగా మారిపోయింది. అంతేకాదు పలు ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఇండియన్ స్టార్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కు ఒక అరుదైన అవకాశం లభించిందని చెప్పాలి.. ఇండియన్ సినిమాల వల్ల సెలబ్రిటీల పేర్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో కూడా మన హీరోలు, హీరోయిన్ల హవ భారీగా పెరిగింది. బిజినెస్ పరంగా కూడా ఇంటర్నేషనల్ సంస్థలు మన వారి కోసం తెగ పోటీ పడుతున్నాయి.
ఇండియన్ హీరోలు, హీరోయిన్ల ఇంటర్వ్యూల కోసం వెతుక్కుంటున్నాయి.ఇక సెలబ్రిటీలతో తమ బ్రాంచ్ ని ప్రమోషనల్ చేయించాలనుకుంటున్నాయి పలు ఇంటర్నేషనల్ సంస్థలు. ఈ క్రమంలోనే పలు ఇంటర్నేషనల్ బిజినెస్ బ్రాండ్స్ ఇండియన్ సెలబ్రిటీలతో తమ వస్తువులను ప్రమోట్ చేయిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే,కత్రినా కైఫ్ లాంటి స్టార్ట్స్ తో పాటు రీసెంట్గా రష్మిక మందన్న కూడా ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అలియా భట్ కూడా చేరిపోయింది.
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన గూచీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ సెలెక్ట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కాస్ట్లీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది గూచీ. దాదాపు డెవలప్ అయిన పలు దేశాలలో దుస్తులు, షూస్ , వాచెస్, బ్యాగ్స్, పలు ఆర్నమెంట్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తులకి ఈ బ్రాండ్ నుంచి బిజినెస్ జరుగుతుంది. ఇక మనదేశంలో కూడా చాలామంది స్టార్స్ ఈ బ్రాండ్ కు సంబంధించిన వస్తువులనే ఉపయోగిస్తున్నారు. దాంతో మన దగ్గర నుంచి కూడా బ్రాండ్ కు ప్రమోషన్ చేయడానికి ఎప్పటినుంచో సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది కంపెనీ. ఇక ఇప్పుడు ఈ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అలియా భట్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.