కర్ణాటకలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో దూసుకెళ్తున్న కాంగ్రెస్

-

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 224 స్థానాలకు గానూ ఈ నెల 10న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  మొత్తం 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. పటిష్ఠ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు 9.10 గంటల వరకు బీజేపీ 79, కాంగ్రెస్ 104, జేడీఎస్ 19, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు సానుకూలంగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకవేళ తమకు ఆధిక్యం రాకపోతే బీజేపీకి అధికారం దక్కుకండా ఉండటానికి తాము ఏదైనా చేయడానికి సిద్ధమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తుందని సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు. మెజార్టీ రాకపోతే తదుపరి ఏం చేయాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. దాదాపు బీజేపీకి అధికారం దక్కకుండా ఉండటానికి తీవ్రంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version