కిమ్స్ ఆసుపత్రికి బయల్దేరిన అల్లు అర్జున్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళా మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ శ్రీతేజను పరామర్శించాలనుకున్నా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆసుపత్రికి వెళ్లలేదు. తాజాగా తన నివాసం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి బయలుదేరారు అల్లు అర్జున్.

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించనున్నాడు. అల్లు అర్జున్ వస్తే.. ముందే తమకు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేసారు. అల్లు అర్జున్ ఆసుపత్రికి వస్తున్నారని ఆసుపత్రి వద్ద పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కొద్ది సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వెళ్లనున్నారు అల్లు అర్జున్. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ దాదాపు 35 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version