కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ప్రయాణిస్తన్న అధికార కారుకు ప్రమాదం జరిగింది. పార్లమెంట్ నుంచి సాయంత్రం తన మంత్రిత్వ శాఖ కార్యాలయంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి ప్రయాణిస్తున్న కారును మరో ప్రభుత్వ వాహనం ఢీ కొట్టింది. దాంతో కేంద్ర మంత్రి కారు ఇంజన్ సీజ్ నుజ్జునుజ్జయ్యింది.
అయితే స్వయంగా డాక్టర్ అయిన జాయింట్ సెక్రటరీ వెనువెంటనే గాయాలపాలైన మంత్రికి ప్రాధమిక చికిత్స చేసారు. ప్రస్తుతం కారు ను రహదారిపై నుంచి తొలగించారు ట్రాఫిక్ పోలీసులు. కేంద్ర సహాయ మంత్రి వర్మ తలకు, కాలికి గాయాలు అయ్యినట్లు తెలుస్తుంది. కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. సొంత నియోజకవర్గం నర్సాపురం లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టు తోనే విజయవాడ బయల్దేరారు శ్రీనివాస వర్మ.