విజయ్ కోసం బన్ని వస్తున్నాడు

-

యువ హీరోల్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ నోటా పెద్ద షాక్ ఇచ్చింది. తెలుగు తమిళ భాషల్లో భారీ అంచనాలతో వచ్చిన నోటా సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ నుండి వస్తున్న సినిమా టాక్సీవాలా. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు.

రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా రిలీజ్ ఒక్క రోజు తర్వాత విజయ్ టాక్సీవాలా వస్తుంది. ఓ క్రేజీ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడట. గీతా గోవిందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బన్ని గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఇక అదే సెంటిమెంట్ తో విజయ్ టాక్సీవాలాకు బన్ని తన బెస్ట్ విషెస్ అందించేందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంకా జువల్కర్ హీరోయిన్ గా నటించింది. మాళవిక నాయర్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మరి విజయ్ దేవరకొండకు ఈ టాక్సీవాలా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version