నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో విచారణ ఎదుర్కొంటున్న సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్నారు. బన్నీ తన ఇంటి వద్ద ఇవాళ అంటే శుక్రవారం ఉదయం 10.45 గంటలకు స్టార్ట్ అవుతారు. 11.30 గంటలకు కోర్టుకు చేరుకుంటారు.
ఈ కేసును ఏసీపీ రమేష్ కుమార్‌తోపాటు సెంట్రల్ జోన్ డీసీపీలు విచారిస్తున్నారు. ఈ కేసులో బన్నీ A11 ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే.
- సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్న అల్లు అర్జున్..
- గతంలో అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..
- నేటితో ముగియనున్న 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్.
- ఇదే కేసులో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు..
- నేడు నాంపల్లి కోర్టు కు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపనున్న అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.