బ్రేకింగ్‌: అమితాబ్ బ‌చ్చ‌న్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

-

బాలీవుడ్ లెజెండ్రీ హీరో, సీనియ‌ర్ న‌టుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. గ‌త నాలుగైదు ద‌శాబ్దాలుగా ఆయ‌న భార‌తీయ సినిమాల్లో న‌టిస్తూ ఉన్నారు. రెండు త‌రాల‌కు చెందిన సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆయ‌న త‌న న‌ట‌నతో మెప్పించారు.

ఇక అమితాబ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారానికి ఎంపిక చేసిన మంత్రి జ‌వ‌దేవ‌క‌ర్ ఆయనను చూసి యావత్ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా గర్విస్తోందని అన్నారు. 76 ఏళ్ల అమితాబ్ ఐదు దశాబ్దాల నట జీవితంలో 190కి పైగా భారతీయ చలనచిత్రాల్లో నటించారు. ఇక భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి  ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను అవార్డు అమితాబ్‌ బచ్చన్‌ నువరించింది.

ఇక అమితాబ్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ సైరాలో ఆయ‌న‌కు గురువుగా క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా అక్టోబ‌ర్ 2న ఐదు భార‌తీయ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version