19 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ‘బ్లాక్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

బాలీవుడ్‌ మూవీ ‘బ్లాక్‌’ డిజిటల్‌ వేదికగా రిలీజ్‌ అయింది. సినిమా విడుదలై 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఆదివారం ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, రాణీ ముఖర్జీ  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించారు. 2005 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.

‘‘బ్లాక్ సినిమాకు 19 ఏళ్లు. దేబ్రాజ్, మిచెల్ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మీకూ స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం’’ అని అమితాబ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ సినిమాలో అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 3 విభాగాల్లో ‘నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’, 11 విభాగాల్లో ‘ఫిల్మ్‌ఫేర్‌’, 9 విభాగాల్లో ‘ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ’ అవార్డులు సొంతం చేసుకుని సత్తా చాటింది. దేబ్రాజ్ అనే టీచర్ రోల్లో అమితాబ్‌ ఆకట్టుకోగా.. దివ్యాంగురాలు మిచెల్‌గా రాణీ ముఖర్జీ అద్భుతంగా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version