రేవంత్ కు బీజేపీ రక్షణ కవచంగా వ్యవహరిస్తోంది : కేటీఆర్

-

రేవంత్ కు బీజేపీ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పుపొందడానికి 36 సార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ కి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 72 గంటలు అవుతున్నా ప్రమాదంలో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్ళే సమయం లేదు.

శకునం చెప్పే బల్లి కుడితిల పడ్డట్టు అయింది కడియం శ్రీహరి పరిస్థితి.. దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రా కడియం శ్రీహరి అని సవాల్ విసిరారు. అప్పుడప్పుడు గాడిదిని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు బ్రహ్మాండంగా పడుతుంది. టకీ టకీన రైతు బంధు పడుతుందా..? రుణమాఫీ పడుతుందా..? అని ప్రశ్నించారు. టకీ టకీ అని దోచుకోవాలి.. ఢిల్లీ అప్పజెప్పాలి అని తెలిపారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండని రేవంత్ రెడ్డి 100 సార్లు చెప్పిండు. కరెంట్ వ్యవస్థను మంచిగా చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version