‘జక్కన్న.. మీరు ఆ సినిమా చేయండి’.. రాజమౌళికి ఆనంద్ మహీంద్రా సూచన

-

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఘనతను ప్రపంచానికి చాటారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీతో ఏకంగా తెలుగు సినిమాకు ఆస్కార్ పురస్కారాన్ని తీసుకువచ్చారు. తాజాగా జక్కన్నకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ విలువైన సూచన చేశారు. సింధు నాగరికతపై ఓ సినిమా చేయాలని దర్శకధీరుడుకి సూచించారు.

సింధు నాగరికతను చూపించే హరప్పా, మొహెంజొ దారొకు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేసిన మహీంద్రా.. ‘ఇలాంటి చిత్రాలు మన చరిత్రకు జీవం పోస్తాయి. మన సంస్కృతి మనకు గుర్తుకు తెచ్చే వాటిలో ఇలాంటివి ఉదాహరణలుగా ఉంటాయి. మన ప్రాచీన నాగరికత గురించి చెప్తూ నాటి పరిస్థితులు ప్రపంచానికి తెలిసేలా ఓ సినిమా తీయాలని రాజమౌళిని కోరుతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. మహీంద్రా ట్వీట్‌కు రాజమౌళి స్పందించారు.

‘అవును సర్, ధోలవీరలో మగధీర షూటింగ్‌ చేస్తున్నప్పుడు నేను అక్కడ చాలా పురాతనమైన చెట్టును చూశాను. అది శిథిలంగా మారిపోయింది. అప్పుడే సింధు నాగరికత ఎదుగుదల, పతనంపై ఓ చిత్రం తీయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పాకిస్థాన్‌ వెళ్లాను. అక్కడ మొహెంజొ దారొకు వెళ్లి రీసెర్చ్‌ చేయాలని ఎంతో ప్రయత్నించా. కానీ, నాకు అనుమతి ఇవ్వలేదు’ అంటూ మహీంద్రా సూచనకు రాజమౌళి బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version