అఖిల్ సినిమాలో బాలీవుడ్ నటి !

-

 

అక్కినేని అఖిల్ – మురళీ కిషోర్ అబ్బూరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం లెనిన్. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ను శర వేగంగా కొనసాగిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమాను నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

ananya panday in lenin movie
ananya panday in lenin movie

కాగా, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి అనన్య పాండేను సంప్రదించినట్లుగా సమాచారం అందుతుంది. స్పెషల్ సాంగ్ చేయడానికి అనన్య పాండే కాస్త సమయం అడిగిందట. మరి ఈ బ్యూటీ ఇందులో ఐటమ్ సాంగ్ చేస్తుందా లేదా అనే సందేహంలో మేకర్స్ ఉన్నారు. కాగా, అక్కినేని అఖిల్ కొద్దిరోజుల క్రితం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా, ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకుని అఖిల్ లెనిన్ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news