అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. సర్ ప్రైజ్ వీడియో వైరల్

-

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. ఆ పోస్టు కింద ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఏడాది తన బర్త్ డే కు వచ్చిన బెస్ట్ సర్ ప్రైజ్ అంటూ తెగ మురిసిపోయింది. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఎవరిచ్చారంటే..?

అనసూయకు విమానం మూవీ టీమ్ క్రేజీ బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.’చాలా  అందమైన సినిమా. ఆ సినిమాలో నేనూ ఓ భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంతే కాదు ఆ సినిమా సెట్ లో నాకు ఎంతో మందితో బలమైన బంధం ఏర్పడింది. నా బర్త్ డే రోజున స్పెషల్ గా పార్టీ ఇచ్చినందుకు చాలా థాంక్స్ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు. ఆఈ అద్భుతమైన సినిమాను మీరు ఎంతో త్వరగా చూడాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ అనసూయ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version