టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న యంగ్ హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. కాగా వరుణ్ తేజ్ వివాహం లావణ్య త్రిపాఠి తో జరగనుందని ఒక వార్త అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనము చూశాము. అయితే అప్పట్లో వరుణ్ తేజ్ మరియు లావణ్య ఇద్దరూ ఈ వార్తను కొట్టిపారేశారు. తాజాగా పింక్ విల్లా వీరి పెళ్లి వార్తను మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. వచ్చే నెల జూన్ లో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగనుందని ప్రస్తావించింది. దీనితో మరోసారి మెగా ఇంట పెళ్లి భాజాలు గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి వరుణ్ తేజ్ మరియయు లావణ్య త్రిపాఠి లను సంప్రదించగా ఏమీ చెప్పలేదని పింక్ విల్లా చెబుతోంది.
సర్ప్రైజ్: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం… ?
-