గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ తరుణంలోనే బలగం మూవీకి అవార్డు వచ్చింది. 2023 ఉత్తమ చిత్రంగా బలగం నిలిచింది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు.
తర్వాత బలగం సినిమాకి దర్శకత్వం వహించి తనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి కమెడియన్ గా వేణు వచ్చాడు. పలు సినిమాల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక్కో సినిమాతో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బలగం మూవీ నేపథ్యంలో వేణుకు క్రేజ్ పెరిగింది. ఇక 2023 ఉత్తమ చిత్రంగా బలగం నిలిచింది.
2014 ఉత్తమ చిత్రం – రన్ రాజా రన్
2015 ఉత్తమ చిత్రం – రుద్రమదేవి
2016 ఉత్తమ చిత్రం – శతమానం భవతి
2017 ఉత్తమ చిత్రం – బాహుబలి కంక్లూజన్
2018 ఉత్తమ చిత్రం – మహానటి
2019 ఉత్తమ చిత్రం – మహర్షి
2020 ఉత్తమ చిత్రం – అల వైకుంఠపురంలో
2021 ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
2022 ఉత్తమ చిత్రం -సీతారామం
2023 ఉత్తమ చిత్రం – బలగం