తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మరో సినీ జంట..!

-

సాధారణంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే చాలా గంటలు వేచి ఉండాల్సిందే. వీఐపీ దర్శనాలతో పలువురు సెలబ్రేటీలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దర్శించుకుంటారు. నిత్యం సినీ ఇండస్ట్రీ నుంచి ఎవ్వరో ఒకరూ దర్శించుకుంటూనే ఉంటారు. నిన్న శ్రీదేవి జయంతి సందర్బంగా తన కుమార్తె జాన్వీకపూర్ తిరుమల వేంకటేశ్వరుడుని దర్శించుకుంది.

తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మంగళవారం రాత్రి వచ్చి అక్కడే నిద్రించి.. బుధవారం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్తప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఇక ఆలయం వెలుపల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను చూసిన భక్తులు, అభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. తమ పెళ్లి తరువాత శ్రీవారి దర్శనానికి రావడం ఇదే మొదటి సారి అని తెలిపారు వరుణ్ తేజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version