రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. మల్హోత్రాకు అక్రమ సంబంధం ?

-

రాజ్ తరుణ్ – మాల్వి మల్హోత్రా కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో తన కుమారుడిని ట్రాప్ చేసి ఆస్తులు లాక్కుందని ముంబైకి చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది. యోగేశ్‌ను జైలుకు పంపిందని, నాలుగేళ్ల నుంచి తమను ఇబ్బంది పెడుతోందని.. మాల్వి, యోగేశ్‌ల వీడియో కాల్స్, కాల్ లిస్టును బయటపెట్టింది.

Raj Tarun and Lavanya

 

కాగా,సినిమా రేంజ్‌ ట్విస్టులతో రాజ్‌ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వ్వహరంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తనను ప్రేమించి మోసం చేశాడని, పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మాల్వీ వచ్చిన తరువాత రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని పోలీసులకు వివరించింది. త్వరలో రాజ్ తరుణ్ కేసు కి సంబంధించి  నోటీసులు ఇవ్వాలని లావణ్యకు చెప్పారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version