సినిమాలకు దూరం కానున్న అనుపమ. షాక్ లో ఫ్యాన్స్..!

-

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ గురించి ప్రతి ఒక్కరికి పరిచయమే.. మొదట అ ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం కలగల్సిన ఈ ముద్దుగుమ్మ అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు ఉన్నట్లు.. ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మాత్రం రావడం లేదు. దీంతో అడపా దడపా సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తర్వాత మరొకసారి నిఖిల్ తో రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 18 పేజీస్ సినిమాలో వీరిద్దరూ జంటగా కలిసి నటించారు. ఈరోజు అనగా డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల అయింది. ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ మాట్లాడుతూ తనకు ముందు నుంచి దర్శకత్వం పట్ల ఆసక్తి ఉందని , కానీ ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని తెలిపింది.

అయితే హీరోయిన్గా అవకాశాలు రావడంతో అలాగే కంటిన్యూ అవుతున్నట్లు ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ అతి త్వరలోనే నేను దర్శకురాలిగా మారి ఒక సినిమాను చేస్తాను.. దర్శకత్వానికి కావలసిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకునేందుకు నటనకు ఒక ఏడాది పాటు విరామం తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది అనుపమ. సినిమాలకు దూరం కాబోతోంది తెలిసి ఆమె అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . అయితే నటనకు దూరం అయిన ఆ తర్వాత దర్శకురాలిగా తన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది అని తెలిసి మరి కొంతమంది ఈమెకు ఆల్ ది బెస్ట్ కూడా చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version