రాష్ట్రంలో ప్రస్తుతం HCU భూముల వివాదం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రతిపక్షాలు అన్ని ఆ భూములను వర్సిటికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ భూముల్లో వైవిద్యమైన జీవ సంపద ఉందని.. ఆ అటవీ భూములను తొలగిస్తే.. పర్యావరణానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని పేర్కొంటున్నాయి. తాజాగా ఈ వివాదం పై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. HCU భూములపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సూచించారు. 50 ఏళ్లుగా ఆ భూముల్లో చెట్లు, కొండలు ఉన్నాయని వాటిలో వివిధ రకాల పక్సులు, జంతువులు నివసిస్తున్నాయని తెలిపారు.
ఇప్పుడు రాస్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని వర్సిటీ భూములు అమ్ముతారా..? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రకృతి, విద్యార్థులకు నష్టం కలిగించవద్దని హితవుపలికారు. గతంలో ఎన్నో ప్రభుత్వ భూములను తెగమ్మిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాత్రం ధర్నా చేయడం విడ్డూరం ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ భూముల వివాదం పై TGIIC కీలక ప్రకటన చేసింది.