బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే రూ.3 కోట్లు ఇస్తామన్నారు : శివబాలాజీ

-

దేశవ్యాప్తంగా ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దుమారం రేపుతోంది. బెట్టింగ్ మాఫియా భూతానికి ఇప్పటికే వేలాది మంది అమాయకుల ప్రాణాలు బలైపోయాయి. ఇక ఈ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల మీద కేసులు నమోదయ్యాయి. పలువురికి నోటీసులు ఇచ్చి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ నటుడు, ఆయన భార్య బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమను కూడా ఈ యాప్స్ ప్రమోట్ చేయమంటూ కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని.. అందుకోసం రూ.3కోట్లు ఆఫర్ ప్రకటించాయని అన్నారు.

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని తమను కూడా చాలా మంది అడిగారని.. రూ.3 కోట్లు ఇస్తామన్నారని నటుడు శివబాలాజీ, ఆయన భార్య మధుమతి తెలిపారు. కానీ తాము చేయమని తెగేసి చెప్పామని వెల్లడించారు. వాటివల్ల చాలా మంది జీవితాలు బలైపోతున్నాయని.. ఆరోజు తాము ప్రమోట్ చేయకుండా ఉండటమే మంచిదైందని వివరించారు. వాటిని ప్రమోట్ చేసిన చాలా మంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version