FLASH : గుడ్ న్యూస్ చెప్పిన విరాట్.. తల్లి కాబోతున్న అనుష్క..!

-

పెళ్లి అయిన రోజు నుంచి పిల్లల గురించి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ  అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ విషయమై అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేశాడు విరాట్. ప్రస్తుతం అనుష్క గర్భవతి అని.. ఇద్దరిగా ఉన్న తమ కుటుంబం త్వరలోనే ముగ్గురిగా మారబోతుందని చెప్పి.. అందుకు సంబంధించి ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇదిచూసిన అభిమానులు వీరుష్కా జంటకు అభినందనలు తెలుపుతున్నారు. ఇకపోతే 2017 డిసెంబర్​లో ఈ జంట వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

కాగా.. ఇటీవల ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రైన సంగతి తెలిసిందే. ప్రపోజ్ చేసిన కొద్దిరోజులకే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ హార్దిక్ ప్రకటించాడు. ఇటీవల పండంటి మగ బిడ్డ కూడా పుట్టాడు. దీంతో.. ఇలాంటి న్యూస్ కోహ్లీ, అనుష్కల నుంచి ఎప్పుడు వింటామో అంటూ అభిమానులు ఎదురు చూస్తుండగా.. ఎట్టకేలకు విరాట్ ఆ శుభవార్త చెప్పేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version