బరువు పెరిగి కెరియర్ నాశనం చేసుకున్న అనుష్క .!

-

సినిమా హీరోయిన్స్ లిస్ట్ తీస్తే జనాలను విపరీతంగా ఆకర్షించిన వారు చాలా మంది వున్నారు. వారిలో సావిత్రి, జయసుధ, జయ ప్రద, విజయశాంతి, సౌందర్య వంటి వారు ప్రధానంగా వున్నారు. తర్వాత కాలంలో అనుష్క కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాని బాహుబలి తర్వాత కాలంలో ఆమె చాలా బరువు పెరిగి సినిమాలకు దూరం అయ్యింది. దీనికి కారణం గా సైజ్ జీరో సినిమా అని దాని వల్ల  బరువు పెరిగి సినిమాలకు దూరం అయ్యింది అంటారు.

కాని ప్రస్తుతం అనుష్క సినిమాలు ఏవి షూటింగ్ దశలో లేవు. రీసెంట్ గా  తెలుగులోనే ఆ మధ్య నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ సినిమా అప్ డేట్ కూడా లేదు. మరి మొత్తంగా అనుష్క తాజా పరిస్థితిని చూసిన వాళ్లు మాత్రం టాలీవుడ్ కి ఆమె దూరమైందనే మెజార్టీ వర్గం భావిస్తోంది.

ఎలాంటి అలికిడి లేకపోవడంతో అనుష్కని తెలుగు చలన చిత్ర పరిశ్రమ మర్చిపోతుందంటూ  ఫిలిం సర్కిల్స్ లో జోరుగా  చర్చ సైతం సాగుతోంది. కొంత మంది పెళ్ళి ప్రయత్నాల లో వుంది అని అంటున్నారు. అనుష్కకి అవకాశాలు రాకే ఆమె  దూరంగా ఉంటుందని మరి కొంత మంది అంటున్నారు. మరి ఇందులో ఆసలు వాస్తవం ఏమిటో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version