AR Rehman Divorce: విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు 

-

 

చిత్ర పరిశ్రమలో మరో జంట విడాకులు తీసుకుంది. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడం జరిగింది. ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్… తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించారు. తన భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు ఏఆర్ రెహమాన్ ప్రకటన చేశారు. మొదటగా ఏఆర్ రెహమాన్ సతీమణి తరఫు న్యాయవాది ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది.

 

పరస్పర నిర్ణయం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఆర్ రెహమాన్ సతీమణి తరపు న్యాయవాది పేర్కొన్నారు. వారి బంధం… కొన్ని రోజులుగా ఒడిదుడుకులతో సాగుతోందని పేర్కొన్నారు ఆమె తరఫు న్యాయవాది. 29 సంవత్సరాలుగా వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని… ఏఆర్ రెహమాన్ సతీమణి సైరా భాను తీసుకోవడం జరిగిందని… అతను పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఏఆర్ రహమాన్ దంపతులకు ముగ్గురు పిల్లలున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news