నాలుగు గంటల పాటు ఆయుష్మాన్ ఖురానాను చిత్ర హింసలు పెట్టిన వేర్పాటు వాదులు

-

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం ‘అనేక్’. ‘తప్పడ్ , ముల్క్, ఆర్టికల్ 15’ ఫేమ్ అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఫిల్మ్ పైన ఎక్స్ పెక్టేషన్స్ ను ఇంకా పెంచేసింది.

ఈ క్రమంలోనే ఫిల్మ్ ను ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. తాజాగా ఆయుష్మాన్ ఖురానా..మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ వేదికగా సినిమాకు సంబంధించిన మరో వీడియో రిలీజ్ చేశారు. సదరు వీడియోలో అండర్ కవర్ కాప్ అయిన ఆయుష్మాన్ ఖురానాను వేర్పాటు వాదులు నాలుగు గంటల నుంచి చిత్ర హింసలు పెడుతుండటం చూడొచ్చు.

నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. జీతేగా కౌన్ హిందుస్తాన్ అని చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నెల 27న విడుదల కానున్న ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version