బోయిన్‌పల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ

-

సికింద్రాబాద్ లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగిన విషయం తెలిసిందే. సమీర్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఓల్డ్ బోయిన్ పల్లి అలీ కాంప్లెక్స్ బస్తీకి చెందిన సమీర్ (20) వెల్డింగ్ పని చేస్తుంటాడు. శనివారం రాత్రి భోజనం చేసి ఇంటి బయట కూర్చుని స్నేహితులతో మాట్లాడుతుండగా సుమారు 11:20 గంటల సమయంలో ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు వ్యక్తులు సమీర్ ని కత్తులు, బ్లేడ్ లతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

సమీర్ పై దాడికి పాల్పడుతున్న సమయంలో అతడి స్నేహితులు, స్థానిక యువకులు వారించే ప్రయత్నం చేస్తే వారిని కత్తులతో బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

అయితే తాజాగా ఈ హత్య కేసును పోలీసులు చేదించారు. సమీర్ హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు డిసిపి రశ్మి పెరుమాళ్ తెలిపారు. సమీర్ – ఫిర్దోస్ కు ఏడాది క్రితం బెంగళూరులో వివాహం జరిగిందని.. పెళ్లి తర్వాత ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. సమీర్ కి విడాకుల నోటీసులు పంపించారని.. అందుకు సమీర్ నిరాకరించడంతో అతడిని చంపినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version