బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్-2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫస్ట్ గెస్ట్ ఎవరంటే..?

-

వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా తన పవర్ ఏంటో చూపించిన బాలకృష్ణ మరోసారి టీవీ ఆడియెన్స్ ని అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహాలో గతంలో వచ్చిన అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షోకు వచ్చిన రేటింగ్స్ కు అసలైన కారణం బాలకృష్ణ. బిగ్ స్క్రీన్ పై పవర్ ఫుల్ డైలాగ్ లు చెబుతూ విలన్ లకు ముచ్చెటలు పట్టించే బాలకృష్ణను.. ప్రేక్షకులు తమ ఇళ్లలో చాలా కూల్ గా గెస్టులతో ముచ్చట చెబుతూ జాలీగా వారిని నవ్విస్తూ  చేసిన అన్ స్టాపబుల్ షో లో ఫ్యాన్స్ బాలయ్యలో మరో కోణాన్ని చూశారు.

బాలయ్య బాబులో ఈ యాంగిల్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఫ్యాన్స్ కోరిక మేరకు ఆహా యాజమాన్యం ఈ ప్రోగ్రామ్ మరో సీజన్ ను ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన అప్ డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సీజన్-2కి సంబంధించి ఆహా ఇచ్చిన అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..?

బాలయ్య బాబు అన్ స్టాపబుల్ సీజన్-2 అక్టోబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ ఫస్ట్ గెస్ట్ గా టీడీపీ అధినేత, బాలయ్య బాబు వియ్యంకుడు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం అటు బాలకృష్ణ ఫ్యాన్స్.. ఇటు చంద్రబాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version