నేడు కడపకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పయనం అవుతున్నారు. ఇందులో భాగంగానే… గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసిపి నేతల దాడిలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించునున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
వాతావరణం అనుకూలించకపోవడంతో గంట ఆలస్యంగా ప్రారంభమైంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. కాగా, ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి కేసులో 26 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయిందని చెబుతున్నారు. గాలివీడు ఎంపిడివో జవహర్ బాబు పై దాడి ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు అయింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారు అన్న అంశం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశౄరు. దాడి ఘటనలో మొత్తం 26 మందిపై కేసు నమోదు అయింది.