బాలకృష్ణ సినిమాలో అవకాశం ఇస్తే వద్దని ఏడ్చిన హీరోయిన్..కారణం..?

-

నట సామ్రాట్ బాలకృష్ణ సినిమాలో అవకాశం అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు కానీ ప్రముఖ హీరోయిన్ లయ మాత్రం ఒక్కసారిగా బాలకృష్ణ సినిమాలో అవకాశం రాగానే ఏడ్చి ఈ సినిమాలో నేను చేయనని చెప్పిందట. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ మీడియాతో వెల్లడించారు.

వీ.వీ.వినాయక్ మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి సినిమాలో టబు పాత్రకు ముందుగా సౌందర్యను అడిగాను. కానీ ఓల్డ్ పాత్ర అప్పుడే చేయనని చెప్పింది. ఇక ఆ తర్వాత టబు ను తీసుకోవాల్సి వచ్చింది. చెల్లెలు పాత్ర కోసం ఒక హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నాము. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ చెల్లెలు పాత్రకి అడిగితే ఏడ్చేసింది లయ. అంతేకాదు చెల్లెలు పాత్రకి ఎందుకు అడుగుతున్నారు? తెలుగమ్మాయిలు హీరోయిన్గా పనిచేయరా? అని అడిగిందట. ఇక మీ ముఖం అమాయకంగా ఉంటుంది బాగా సెట్ అవుతుంది అని చెప్తే .. అలా ఎందుకు చూస్తారు?హీరోయిన్గా ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించింది. ఇక దీంతో చేసేదేమీ లేక నేను సారీ చెప్పి వచ్చేసాను. ఇక ఇండస్ట్రీలో తల్లి , చెల్లి పాత్రలకు ఆర్టిస్టులను వెతకడం కష్టమని ఆయన తెలిపారు.

ఆ తర్వాత దేవయానిని బాలకృష్ణకు చెల్లిగా తీసుకున్నాము అని ఆయన తెలిపారు. ఇకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్లు లయ నిజంగానే మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది.. ఒకవేళ చేసి ఉండి ఉంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా బిజీగా ఉండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టడానికి చూస్తున్న లయ అవకాశాలు అయితే ఇంకా తలుపు తట్టలేదని చెప్పాలి. ఇక ఈ వయసులో కూడా ఆమె గ్లామర్ డోస్ పెంచేసి సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి అయితే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె కు సినిమాలలో అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version