పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

-

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 12 సంవత్సరాల క్రితం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, బండ్ల గణేష్ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. 12 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ తో హౌస్ ఫుల్ అయిపోయాయి.

ఈ సందర్భంగా శనివారం ప్రెస్ మీట్ నిర్వహించగా.. పవన్ కళ్యాణ్ ని ఎంతగానో అభిమానించే మీరు ఒకప్పుడు ఆయనని తక్కువ చేసి ఎందుకు మాట్లాడారు..? అని ప్రశ్నించగా.. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. పవన్ కళ్యాణ్ తనకు బతుకునిచ్చాడు అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నారు బండ్ల గణేష్.

పవన్ కళ్యాణ్ లేకపోతే తాను ఆర్థికంగా ఎదిగే వాడిని కాదని, తనకి ఈ పేరు కానీ, హోదా కానీ ఉండేది కాదన్నారు. పవన్ లేకపోతే తాను చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ మిగిలిపోయే వాడినన్నారు బండ్ల. తాను పవన్ కళ్యాణ్ ని ప్రాణం పోయినా విమర్శించనని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో లేనప్పుడు మరొకలా మాట్లాడనన్నారు. తాను కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తనని.. రాజకీయాలలో ఉంటే కాంగ్రెస్ లోనే ఉంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version