BREAKING: హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో..రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఇవాళ ఉదయం.. సాయంత్రం సమయాల్లో సిటీలో భారీ కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక..ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షపాతం ఉండటంతో జిల్లాల్లోని రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది.
అటు జిల్లా కలెక్టర్స్ తో పాటు ఆయా శాఖల అధికారులను అలెర్ట్ చేసిన ఐఎండీ..తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లా రెడ్.. పదిహేను జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల సూర్య పేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.