గురుకుల పిల్లలను కర్రలు విరిగిపోయేలా కొడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా, పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు..అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని… ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆగ్రహించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు.
గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి ఉందని… ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది గురుకులాల్లో జాయిన్ చేస్తే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. నువ్వు పూర్తిగా విఫలం అయ్యావు అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహించారు. పిల్లలు రోడ్డు మీదకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బాధ తెల్సుకోవాలని వచ్చాను…. దుఃఖాన్ని ఆపుకోలేక పోతున్నారన్నారు. భయంతో వణికిపోతున్నారు. కర్రలు విరిగేలా కొడుతున్నారని ఏడుస్తున్నారని తెలిపారు. అన్నంలో, పప్పులో పురుగులు అంటే తినేసి తినండి అంటున్నారు అని బాధపడుతున్నారు….ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు. రెండో జత ఇవ్వలేదు అంటున్నారన్నారు. కేసీఆర్ గారు సన్నబియ్యం తో అన్నం పెడితే మీరు గొడ్డు కారంతో పెడుతున్నారని మండిపడ్డారు.