Bandla Ganesh: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. ప‌వ‌న్ నా ధైర్యం.. నా దైవం.. అన్ని ప్రశ్నలకు ఆ రోజే స‌మాధానం..!

-

Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లిస్ట్ లో ఫస్ట్ వినిపించే పేరు బండ్ల గణేష్. తాను కేవ‌లం ప‌వ‌న్ అభిమానినే కాదని.. భక్తుడినని.. ప‌వ‌న్ నా దైవమ‌ని బండ్ల గణేష్ చెప్తుంటాడు. ఇక బండ్ల గ‌ణేష్ అటూ న‌టుడుగానే కాగా.. ప‌లు చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. మంచి స‌క్సెస్ పొందాడు. ఇక ఆయ‌న త‌రుచు ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలిచి వైర‌లవుతాడు. రీసెంట్ గా మా ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశాడు.

తాజాగా ఆయ‌న మ‌రోసారి వైర‌ల‌య్యాడు. ఇటీవ‌ల రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ మ‌ద్ద‌తుగా కామెంట్ చేశారు. నా పయనం నా జీవితం నా గమ్యం నా ధైర్యం మేము మీతో మా ప్రయాణం మా శ్వాస ఉన్నంత వరకు మీరే మా దైవం జై పవర్ స్టార్ ⁦@PawanKalyan అంటూ ట్వీట్ చేశారు.

అలాగే.. ఈ అంశంపై అక్టోబ‌ర్ 11న మీడియా ముందుకు వ‌చ్చి .. ప్రెస్ మీట్ పెడుతాన‌ని.. తాను ప్రస్తుతం మా ఎన్నికలతో బిజీగా ఉన్న‌న‌ని .. అక్టోబర్ 10న ఎన్నిక ముగిసిన తర్వాత 11వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి.. ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానని ట్విట్ చేశారు. నిమిషాల్లోనే ఈ ట్వీట్ వైర‌ల‌య్యింది. ఈ పోస్టుపై పెద్ద ఎత్తున్న అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీగా పోటీ చేయడం ఒక ఎత్తు అయితే.. అక్టోబర్ 11న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మరో ఎత్తు’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ని బండ్ల గణేష్ రీ ట్వీట్ చేశారు.

మరోవైపు రిపబ్లిక్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నాని, కార్తికేయ ఇలా కొందరు నుంచి మినహా పవన్ కళ్యాణ్ కి మద్దతు లభించలేదు. పొలిటికల్ గా మాత్రం జనసేన పార్టీ నేతలు వైసీపీకి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version