బీ రెడీ ఈ రోజు ఫాన్స్ ని కలవబోతున్న బాలయ్య ఎప్పుడో ఎక్కడో తెలుసా ..?

-

నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగు పెట్టారు. అయితే ఫ్యాన్స్ మాత్రం నిన్నటి నుంచే సంబరాలు జరుపుకుంటున్నారు. బాలయ్య సినిమా న్యూస్ రావడం తో అభిమాల ఆనందం రెట్టింపు అయింది. ఇక బాలయ్య పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు సన్నాహాలు చేసినా… కరోనా వైరస్ కారణంగా అంతా తారుమారు అయింది.

 

అంతేకాదు బాలకృష్ణ కూడా ఎవరూ నన్ను కలవడానికి రావద్దని ఫ్యాన్స్ కి తెలిపారు. కాని ఉన్నపలంగా సర్‌ప్రైజ్ మీద సర్‌ప్రజ్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ కోసం ఈ సారి తానే వస్తున్నాను అని బాలయ్య ప్రకటించారు. బాలకృష్ణ ఈ రోజు పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించనున్నారు. వాళ్ళు అడిగే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 నిమిషాలకు లైవ్ కి రానున్నారు.

బాలయ్య ఇలా సోషల్ మీడియాలో అభిమానుల కోసం రావాడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మరి బాలయ్యని ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో వాటికి బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక బాలయ్య పుట్టిన రోజు కానుకగా విడుదలైన” BB3″ టీజర్ కి అభిమానులండి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version