మీకు బాలయ్య.. నాకు ముద్దుల మావయ్య..!

-

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకి అతీతంగా ఎంతో మంది నాయకులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం బాలయ్యని శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆయన అల్లుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపిన శుభాకాంక్షలు మరో ఎత్తు. ట్విట్టర్ వేదికగా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అందరికీ ఆయన బాలయ్య. నా ఒక్కడికీ ఆయన ముద్దుల మావయ్య. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తనను నమ్ముకున్న వారికి అండగా నిలిచే కథానాయకుడు ఆయన. బాలా మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే షష్టిపూర్తి మహోత్సవ అభినందనలు’ అంటూ ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version