బెంగళూరు భామ తన అందంతోనే కాదు అదృష్టాన్నీకలిపి చేస్తున్న ప్రతి ప్రయత్నం మంచి ఫలితాలే ఇస్తున్నాయి. ఇప్పుడున్న హీరోయిన్ల అందరి కంటే కొంచెం ఓ ఎత్తు ఎక్కవ స్థానాన్నే అందుకుని ఇమేజ్ పెంచుకుంటోంది. రఫ్ అంట్ టఫ్ లుక్ లోనూ, క్లాస్ టచ్ ఉన్న పాత్రలోనూ ఆమె ఒదిగిపోతుంది. మరీ అంత నటనకు ప్రాధాన్యం ఉన్నపాత్రలు లేకపోయినా కూడా ఉన్నంతలో హాయిగా తన పని తాను చేసుకునిపోతుంది.
బుట్టబొమ్మా బుట్టబొమ్మా పాటతో తెగ హడావుడి చేసిన పూజాహెగ్డే ప్రస్తుతం మాల్దీవుల (పడగపు దీవులు అని మరోపేరు) చెంత సందడి చేస్తున్నారు. వరుస షూటింగ్ లతో అలసిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ తన ఫ్యామిలీతో వెకేషన్ ను స్పెండ్ చేస్తున్నారు. వరుస ప్రతిష్టాత్మక సినిమాలతో సందడి చేస్తున్న ఈ భామ అటు ప్రభాస్ ఇటు మహేశ్ తో స్క్రీన్ పంచుకుంటూ మంచి విజయాలనే నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అందాల బొమ్మ గురించి ఇంకొంత.
అందం,అభినయం రెండూ కలిసిన భామలు ఇప్పుడు అరుదే కానీ కాస్తంత అదృష్టం ఉంటే మంచి అవకాశాలు పలకరిస్తాయి అనేందుకు పూజాహెగ్డేనే ఉదాహరణ. టఫ్ గా కనిపిస్తాడు కానీ మాట వింటాడు అంటూ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తారక్ ను మైమరిపించిన ఈ బెంగళూరు సోయగం, తరువాత కూడా విజయ పరంపరను కొనసాగించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ అందుకుంది.ఈ సినిమా ఆమె కెరియర్ కు ఓ ప్లస్ పాయింట్ అయింది. వీటి మధ్యలో అల వైకుంఠపురం సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. గ్లామర్ రోల్స్ తోనే నెగ్గుకు వస్తూ తనదైన హవాను నడిపిస్తోంది.